లక్నో:ఎన్నికలవేళ ఉత్తరప్రదేశ్‌లో భాజపాకు అనూహ్యమైన ఎదురు దెబ్బ తగిలింది . అలహాబాద్ లోక్‌సభ సభ్యుడు శ్యామ చరణ్ గుప్తా( భాజపా) ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. బాందా నియోకవర్గం అభ్యర్థిగా ఆయన్ను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ శనివారం ట్వీట్ చేసింది. ఇది ఒకే రోజు భాజపాకు తగిలిన రెండో దెబ్బ . పార్టీలో కొత్త వారిని చేర్చుకుని ఎంతోకాలంగా పార్టీ కోసం కష్ట పడు తున్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నా రనే ఆగ్రహంతో తేజ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు(భాజపా) రాం ప్రసాద్ శర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 15 ఏళ్లు ఆర్ఎస్ఎస్‌కు, 29 భాజపాకు సేవలందించారు.