కోలకత్తా: భాజపా నేతలు రథయాత్ర పేరుతో ప్రజలను విభజిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ‘రథయాత్ర మతపరమైన ఉత్సవం. ఇందులో మనమంతా పాల్గొంటాం. జగన్నాథస్వామి, బలరాముడు, సుభద్రదేవి వంటివారు రథాల్లో ప్రయాణించడం గురించి మనకు తెలుసు. భాజపా నేతలు మాత్రం రథయాత్రను తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సమాజాన్ని విభజించి, ఘర్షణలు సృష్టిస్తున్నారు. భాజపా నేతలే దేవుళ్లలా రథాలపై ప్రయాణిస్తున్నార’ని దుయ్యబట్టారు. ప్రచారానికి వస్తున్న నేతలను బయటి వ్యక్తులుగా అభివర్ణించారు . ‘విలాసవంతమైన కార్లలో వచ్చి ఫొటోల కోసమే స్థానికుల ఇళ్లలో భోజనాలు చేస్తున్నారు. ఫైవ్-స్టార్ హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్నే గ్రామస్థుల ఇళ్లలో తింటున్నా రు. బెంగాల్‌ను బెంగాల్ ప్రజలే పాలించుకుంటారని, గుజరాత్ నుంచి వచ్చినవారు కాద’ని పునరుద్ఘాటించారు.