టాలీవుడ్‌ ప్రముఖలపై జీఎస్టీ దాడులు..

  • In Film
  • December 24, 2019
  • 145 Views
టాలీవుడ్‌ ప్రముఖలపై జీఎస్టీ దాడులు..

జీఎస్టీ అధికారుల వరుస దాడులు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇంట్లో దాడులు చేసిన అధికారులు మంగళవారం మరికొంతమంది ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చేయడం కలకలం సృష్టిస్తోంది.తాజాగా దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌,వక్కంతం వంశీతో పాటు సినీ నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్, సితారా ఎంటర్ టెయిన్ మెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. దర్శక నిర్మాతలు, బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు ధ్రువపత్రాలను దాఖలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని వీరు ఎగ్గొట్టారన్నది ప్రధాన ఆరోపణ. వీరు చెల్లించిన పేమెంట్స్, సమర్పించిన పత్రాలు సరైనవేనా? అన్న కోణంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం యాంకర్లు అనసూయ,సుమ ఇళ్లల్లో కూడా జీఎస్టీ అధికారులు సోదాలు చేసినట్లు వార్తలు రాగా ఇద్దరు దాడుల వార్తలను ఖండించారు.అయితే అనసూయ పాతిక లక్షల టాక్స్ చెల్లించిందని ఇంకా రూ.55 లక్షలు చెల్లించాల్సివుందని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ ఇంటలిజెన్స్ హెడ్ బాలాజీ మజుందార్ ప్రముఖ ఆంగ్ల పత్రికతో ఈ విషయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.సర్వీస్ టాక్స్‌కు సంబంధించి అనసూయ రూ.35 లక్షల వరకు చెల్లించలేదని.. దానికి వడ్డీ పెరిగి మరో పదిహేను లక్షలు యాడ్ అయిందని చెప్పారు. ఆమె సరైన సమయానికి టాక్స్ చెల్లించకపోవడంతో పెనాలిటీతో కలిపి మొత్తం రూ.80 లక్షలు అయిందని తెలిపారు. ఈ మొత్తంలో ఆమె పాతిక లక్షలు మాత్రమే చెల్లించిందని.. మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సిఉందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos