బాధితుల్ని ఇంకా పీడిస్తారా

బాధితుల్ని ఇంకా పీడిస్తారా

న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో వినియోగిస్తున్న లైఫ్ సేవింగ్ మెడిసన్లు, సామగ్రిపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తొలగించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ సమావేశం శుక్రవారంనాడు జరుగనున్న నేపథ్యంలో ప్రియాంక ఓ ట్వీట్లో ఈ డిమాండ్ చేశారు. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్, సోప్స్, కాటన్ మాస్క్, పీపీఈ కిట్స్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ రెమ్డెసివిర్ ఇతర కోవిడ్ డ్రగ్స్, వెంటిలేటర్లు, కృత్రిమ శ్వాస పరికరాలపై జీఎస్టీ విధిస్తున్నారని, బాధిత ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం అత్యంత క్రూరమైన, ఏమా త్రం జాలిలేని వ్యవహారమని ప్రియాంక అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న అన్ని లైఫ్ సేవింగ్ మెడిసన్లు, సామగ్రిపై జీఎస్టీ తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రియాంక కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos