వైభవంగా వేరుశెనగ జాతర

హొసూరు : స్థానిక రాజ గణపతి నగర్‌లోని రాజ గణపతి ఆలయంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 62వ వార్షిక వేరుశెనగ జాతరను అతి వైభవంగా నిర్వహించారు. అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధి పొందిన రాజ గణపతి ఆలయంలో కొత్త సంవత్సరాది సందర్భంగా ఏటా వేరుశెనక్కాయల జాతర నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రాజ గణపతికి విశేష పూజలు నిర్వహించారు. హొసూరు ప్రాంతంలో సకాలంలో వర్షాలు బాగా కురిసి,  పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేరుశెనక్కాయల జాతర నిర్వహిస్తారు. తరువాత వేరుశెనగ కాయలకు పూజలు నిర్వహించి ఆలయం మీద  చల్లి, భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా జరిగే వేరుశెనగ కాయల జాతరను పురస్కరించుకుని

ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos