బాగలూరులో రైతు బజారు నిర్మాణానికి భూమి పూజ

బాగలూరులో రైతు బజారు నిర్మాణానికి భూమి పూజ

హోసూరు : ఇక్కడికి సమీపంలోని బాగ లూరులో రూ.48 లక్షల ఖర్చుతో రైతు బజారు, పూల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. బాగలూరు పంచాయతీ అధ్యక్షుడు విడి.జయరామ్, కౌన్సిలర్ మునిరత్నా మునిరాజ్, గుణశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మినీ పారిశ్రామికవాడగా ఎదుగుతున్న బాగలూరులో వీలైనంత త్వరగా రైతు బజారు, పూల మార్కెట్ నిర్మాణం పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పంచాయతీ అధ్యక్షుడు విడి. జయరాం ఈ సందర్భంగా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos