హోసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరులో కొత్తగా నిర్మించనున్న సముదాయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. హోసూరు యూనియన్ బాగలూరులో రూ.76 లక్షల ఖర్చుతో సముదాయ భవనాన్ని నిర్మించబోతున్నారు. అందులో భాగంగా బాగలూరు పంచాయితీ అధ్యక్షుడు విడి.జయరాం అధ్యక్షతన భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాయణ స్వామి, జిల్లా కౌన్సిలర్ రవి కుమార్, కౌన్సిలర్ మునిరత్నా మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.