నల్గొండ : అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. దీనికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కు, పొడవైన తోక వుంటాయని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వరరావు, చందంపేట అటవీ అధికారి రాజేందర్ విలేఖరులకు తెలిపారు. నలుపు, తెలుపు, బూడిద రంగు కలబోతతో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఎత్తైన చెట్లపైన, అడవిలోని కొండలు, గుట్టలపైనే సంచరిస్తుంది. అత్తిపండ్లు, పాములు, బల్లులను తింటాయి. ఈ పక్షిని అడవి రైతు, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారన్నారు.