హోసూరు: పట్టణ పరిసారాల్లో సోమవారం రాత్రి కురిసిన గాలివానకు రూ.లక్షల విలువ చేసే గ్రీన్ షెడ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన గ్రీన్ షెడ్లలో రోజా, జర్బరా ,కార్నేషన్, క్యాప్సికం తదితర వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు .గ్రీన్ షెడ్ల పై ఉన్న ప్లాస్టిక్ పేపర్ పూర్తిగా చిరిగిపోవడం క్యాప్సికం, రోజా తదితర పంటలు నాశనమయ్యాయి. బాగలూరు సమీపంలోని చొక్కనాథ పురం,ఇచ్చంగూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లోనూ గ్రీన్ షెడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో రూ. సుమారు కోటి వరకూ నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. నష్ట పరిహారాన్ని తమను ఆదుకోవాలని రైతులు జిల్లా రెవిన్యూ అధికార్లకు విన్నవించారు