శ్రీన గర్: శ్రీనగర్‌లో అత్యంత రద్దీగా ఉండే విపణి లాల్ చౌక్, హరి సింగ్ వీధిలోఉగ్రవాదులు సోమవారం మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో గ్రనేడ్ దాడికి పాల్ప డ్డారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 12 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత వారం సోపోర్ బస్టాండ్ వద్ద ఇక్బాల్ మార్కెట్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడడంతో 19 మంది గాయపడ్డారు.