న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్పై డ్రగ్ కంట్రోలర్ శాఖ దాఖలు చేసిన కేసులో స్టే జారీకి సుప్రీం కోర్టు నిరాకరించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించి నపుడు గంభీర్ ఫౌండేషన్ సుమారు రెండు వేలకు పైగా ఫాబీఫ్లూ మాత్రల్ని ప్రజలకు పంచింది. దీంతో ఫాబీఫ్లూ టాబ్లెట్లను అక్రమంగా నిల్వ చేసినట్లు గంభీర్పై ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశానుసారం డీజీసీఐ.. గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను అనధికారికంగా నిల్వ ఉంచి పంపిణీ చేయడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణిస్తూ ఆ ఫౌండేషన్ను దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ కోసం కోర్టు అధికారులకు ఆరు వారాల గడువు ఇచ్చింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించి గంభీర్ తరపు న్యాయవాది స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీ హైకోర్టు ముందే మీ వాదనలు వినిపించా లంటు తేల్చి చేప్పింది.