మాలె: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా స్థానిక శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినదించారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన సింగపూర్కు పయనమవుతున్నారు. మాల్దీవుల నుంచి సింగపూర్కు బయల్దేరి వెళ్లిన వెలనా అంతర్జాతీయ విమానా శ్రయంలో బుధవారం రాత్రి కారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. సింగపూర్కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది.