
న్యూఢిల్లీ: భారత తొలి లోక్ పాల్ గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ శనివారం ఇక్కడ ప్రమాణం చేసారు. ప్రస్తుత ,మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులకు వ్యతిరేకంగా వచ్చే అవినీతి ఆరోపణల్ని ఆయన విచారిస్తారు రాష్ట్రపతి భవన్లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణాన్ని చేయించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫిబ్రవరిలోగా లోక్ పాల్ ను నియమించి తీరాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించటంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక సమితి ఇటీవల జస్టిస్ ఘో ష్ (66) ను ఆ పదవికి ఎంపిక చేసింది. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఆయన నివృతులయ్యారు.