న్యూఢిల్లీ: ‘గూండాలకు బీజేపీ ప్రభుత్వం బహిరంగ రక్షణ కల్పిస్తోంద’ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమ ర్శిం చారు. అహ్మదాబాద్లో శాంతి యుత ప్రదర్శన చేస్తున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై ఎబీవీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు వీడి యోలో చాలా స్పష్టంగా ఉందన్నారు. ‘గూండాలకు బీజేపీ ప్రభుత్వం బహిరంగ రక్షణ కల్పిస్తోంది. ఇంతకుముందు కూడా, జైలు నుంచి గూండాలు విడుదలైనప్పుడు రాష్ట్ర మంత్రులు పూలదండలతో స్వాగతం చెప్పారు. ఇప్పుడు రోడ్లపై కూడా చట్టా నికి గంతలు కడుతున్నారు. శాంతియుత ప్రదర్శన జరుపుతున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై ఏబీవీపీ గూండాలు దాడి చేశార నడం సుస్పష్టం’ అని ప్రియాంక ట్వీట్లో దుయ్యబట్టారు. ఘర్షణ దాఖలైన వీడియోను కూడా ఆమె అందించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకులుగానే చూస్తుండిపోయారని తప్పుపట్టారు. అహ్మదాబాద్లో మంగళవారం విద్యార్థి వర్గా ల మధ్య జరిగిన ఘర్షణపై ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.