భారత్ లో గూగుల్ రూ.75 వేల కోట్ల భారీ పెట్టుబడులు ..

భారత్ లో గూగుల్ రూ.75 వేల కోట్ల భారీ పెట్టుబడులు ..

భారత్ లో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.భారత ప్రభుత్వం ప్రకటించిన ‘డిజిటల్ ఇండియా’ను సాకారం చేసేందుకు రూ.75 వేల కోట్ల మేర వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు.మా కోసం ఎంతో విలువైన సమయం కేటాయించారంటూ ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. “డిజిటల్ ఇండియా కోసం మీ తపన ఎంతో ఆశావహ భావన కలిగిస్తోంది. ఈ దిశగా గూగుల్ తన కృషిని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది” అంటూ స్పందించారు.  భారత్ లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి తమ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ అభిలషిస్తున్న డిజిటల్ ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నామని ట్విట్టర్ లో తెలిపారు. ఈ క్రమంలో భారత కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రమేశ్ పోఖ్రియాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos