ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేస్తున్న సమయంలో 120 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.38 కోట్లు. హరిద్వార్‌లోని ఓ ఫ్యాక్టరీకి ఈ బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో ముడి బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి తరలిస్తారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి వ్యాను డ్రైవరు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, క్యాషియర్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.