న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేని భాజపా లోక్సభ సభ్యురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూరు దేశ భక్తుడుగా అభివ ర్ణించిటం భాజపా, ఆర్ఎస్ఎస్ భావ జాలానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురు వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఆమె చేస్తోన్న వ్యాఖ్యలు బాజపా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనాలు. వారి తీరు బయటపడకుండా ఉండదు. దీనిపై నేను ఏ విధంగా స్పందించాలి? ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నా సమ యాన్ని నేను వృథా చేసుకోను’ అని అన్నారు. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ ముసాయిదాపై గురువారం లోక్సభలో చర్చ జరిగింది. మహాత్మా గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందో గాడ్సే స్వయంగా చెప్పిన మాటలను డీఎంకే సభ్యు డు ఎ.రాజా ప్రస్తావించినపుడు ఒక దేశభక్తుడి వ్యాఖ్యలను ఉదాహరణగా చెప్పనక్కర్లేదని ప్రజ్ఞాసింగ్ గద్దించారు.