గోవా:ఇక్కడి వైద్య కళాశాల ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్సిజన్ కొరతతో గత 24 గంటల్లో 76మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.గోవా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై విపక్షాలు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. గోవాలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఏప్రిల్ 30- మే 11 మధ్య 378మంది మరణించినట్టు ప్రభుత్వం బాంబే హైకోర్టుకు వెల్లడించింది.