ముంబై : మహారాష్ట్ర తరహాలోనే భాజపా పాలిత గోవాలోనూ త్వరలో అద్భుతం జరగనుందని శివసేన లోక్సభ సభ్యుడు సంజ య్ రౌత్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశా య్ మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీలతో కొత్త కూటమి ఏర్పాటుకు యోచిస్తు న్నాం. త్వరలో గోవాలోనూ అద్భుతం జరగబోతోందని మేం ఆశిస్తున్నాం. గోవా తరువాత ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారిస్తాం. దేశ వ్యాప్తంగా భాజపా ఇతర కూటమి ఏర్పాటు చేయాలకుంటున్నామ’ని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు కోర్టు తాఖీదులు జారీ చేయడం గురించి తనకు సమాచారం లేదన్నారు. తమ దృష్టంతా గోవాపైనే కేంద్రీకృతమై ఉందన్నారు.