గుంటూరు : గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. శనివారం నిర్వహించిన గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ తీవ్ర ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు. కౌన్సిల్ హాల్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల తీరుపై కమిషనర్ మండిపడ్డారు. చేతిలో పుస్తకాలు విసిరివేసి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. వైసిపి కార్పొరేటర్లు కమీషనర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడం, వైసీపీ నేతలు మాట్లాడిన విధానంపై కమిషనర్ విసుగు వ్యక్తం చేశారు. అధికారుల తీరును విమర్శిస్తూ … తమాషాగా ఉందా అంటూ వైసీపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యల పై మునిసిపల్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభను బాయ్ కాట్ చేస్తూ కమిషనర్ పులి శ్రీనివాసులు బయటకు వెళ్లిపోయారు. మేయర్ మనోహర్ నాయుడు సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం కౌన్సిల్ హాల్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ను దూషించిన వైసిపి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గత గవర్నమెంట్లో రద్దు చేసిన ఎఫ్ డీలపై ఇప్పుడున్న అధికారులు వివరణ కోరగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కి కమిష నర్ కి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ మేయర్ తీరును ఐఏఎస్ లు తప్పుపట్టారు.