సెల్ఫీ పిచ్చి.. వరదలో చిక్కుకున్న అమ్మాయిలు..

సెల్ఫీ పిచ్చి.. వరదలో చిక్కుకున్న అమ్మాయిలు..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో యువతీయువకులు ఖాళీగానే ఉన్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని చింద్వాడాకు చెందిన కొంతమంది అమ్మాయిలు జున్నార్ దియో ప్రాంతంలోని ఓ నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు నది మధ్యలో ఉన్న బండరాళ్లపై చేరి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఇంతలో ఉద్ధృతమైన రీతిలో వరద నీరు నదికి పోటెత్తింది. దాంతో బయటికి వచ్చే వీల్లేక ఆ ఇద్దరు అమ్మాయిలు నది మధ్యలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాణాలకు తెగించి వారిద్దరినీ కాపాడారు. కాస్త ఆలస్యమైతే వాళ్లిద్దరూ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేదని పోలీసులు తెలిపారు.ప్రాణాలతో బయటపడ్డ ఆ ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు స్థానికులకు ఫ్రెండ్స్ కు థ్యాంక్స్ చెప్పారు. మీరు కూడా ఎక్కడైనా సెల్ఫీ తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos