న్యూ ఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫఢ్ణవిస్ బుధవారం సాయంత్రాని కల్లా తన బలాన్నిదిగువ సభలో నిరూపించుకోవాలని అత్యున్నత న్యాయ స్థానం మంగళ వారం ఇచ్చిన ఆదేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ స్వాగతించారు. జరగ నున్న బల పరీక్షలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల నేతృత్వంలోని ‘మహారాష్ట్ర ప్రగతిశీల కూటమి’ విజయం సాధించడం ఖాయ మని విశ్వాసాన్ని వ్యక్తీకరించారు. ‘ అత్యతున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రేపు జరిగే బలపరీక్షలో గెలవగల సంఖ్యా బలం మాకు ఉంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ తీర్పు మైలు రాయి లాంటిది. రేపు ఐదు గంటల్లోగా అంతా తేలిపోతుందని మేము భావిస్తున్నాం. ఇక భాజపా పని అయిపోయింద’ని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మలిక్ పేర్కొన్నారు.