లఖనవూ: ఘాజీపుర్లోని గంగానది ఒడ్డుకు శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో మృత దేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇటీవలే గంగానదిలో కొవిడ్ మృత దేహాలను ఖననం చేస్తున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నదశలో నదిలో మృతదేహాలు కనిపించడం పట్ల స్థానికులు ఆందోళన చెందారు. బిహార్ బక్సార్ జిల్లాలోని గంగానదిలో చాలా మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది.