న్యూ ఢిల్లీ : రానున్న ఆరు నెలల్లో దేశంలోని పెట్రోలు వాహనాలతో ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా సమానం అవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక ఎక్స్‌పోలో ఆయన మాట్లాడుతూ దిగుమతి-ప్రత్యామ్నాయం, ఖర్చు-సమర్థత, కాలుష్య రహిత, స్వదేశీ తయారీ భారత దేశ విధానాలని ఆయన చెప్పారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడానికి మౌలిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచి రోడ్లను వేయడం ద్వారా రవాణా ఖర్చును తగ్గించవచ్చునని తెలిపారు.