విద్యార్ధి నాయకుడిగా .. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం చేసే పోరాటంలో ప్రాణాలను అర్పించిన ఉస్మానియా విద్యార్థి ‘జార్జిరెడ్డి‘ జీవితచరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.’అడుగడుగు .. మా ప్రతి అడుగు .. నీ వెనకాలే మా పరుగు .. అడుగడుగు మా మది నడుగు ..” అంటూ ఈ పాట సాగుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతం .. రేవంత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. యూనివర్సిటీ నేపథ్యంలో సాగే సంఘటనలపై కట్ చేసిన ఈ లిరికల్ వీడియో సాంగ్, స్టూడెంట్స్ ను టచ్ చేసే మాదిరిగా వుంది.ఈ నెల 22న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.