ఇది నిజమైన జీడీపీ కాదు

ఇది నిజమైన జీడీపీ కాదు

న్యూ ఢిల్లీ : దేశం రెండంకెల జాతీయ స్థూలోత్పత్తి వృద్ధి( జిడిపి) రేటును సాధించే చారిత్రక సంధి కాలంలో ఉందని ఐదేళ్ల కిందట వ్యాఖ్యానించిన ప్రధాని ప్రధాన ఆర్థిక మాజీ సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ గత ఐదేళ్లలో సాధించినట్లు చెబుతున్న జీడీపీ వృద్ధి రేటును అనుమానించారు. ‘భాజపా ప్రభుత్వం చూపించిన 6.8 నుంచి 7.1 శాతం వృద్ధి రేటు సరైనదని కాదు. అంతకన్నా తక్కువ ఉంటుంది. స్వతంత్ర ఆర్థిక నిపుణులతో తిరిగి లెక్కలు వేయించాల’ని సూచించారు. ‘గత ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉంది’ గురువారం విడుదల చేసిన ఆర్థిక సర్వే నివేదికలో ప్రధాన మంత్రి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. భాజపా ప్రభుత్వం చివరి రోజుల్లో జీడీపీ రేటు మరింత పడిపోయిన విషయాన్ని , నిరుద్యోగ సమస్య 6.1 శాతంతో గత 49 ఏళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకుందని కేంద్రం వెల్లడించిన విషయాన్ని సుబ్రమణియన్ ప్రస్తావించలేదు. ప్రస్తుతం 2.8 ట్రిలియన్ డాలర్లు ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం తన లక్ష్యమన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్ష్యాన్ని ఆర్థిక సర్వేలో చేర్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos