ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను గే (స్వలింగ సంపర్కుడు) అని
సంబోధించాడనే ఆరోపణపై నాలుగు వన్డేల నిషేధానికి గురైన విండీస్ పేసర్ షానన్ గాబ్రియెల్
ఐసీసీ విచారణ ఎదుట హాజరై ఏం చెప్పిందీ వెల్లడించాడు. నీకు పురుషులంటే ఇష్టమా అని మాత్రమే
రూట్ ను అడిగానని, గే అనే మాటతో సంబంధం లేదని వివరించాడు. ‘మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో మేం ఒత్తిడిలో ఉన్న సమయంలో బౌలింగ్‌కు దిగా. అప్పుడు రూట్ నన్ను చూసి నవ్వాడు. అటువంటి పరిస్థితుల్లో నవ్వడం ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే వ్యూహం అయి ఉండొచ్చు. దాంతో ఎందుకు నవ్వుతున్నావు రూట్. నీకు పురుషులంటే ఇష్టమా అని అడిగా’ అని గాబ్రియెల్ వెల్లడించాడు. అందుకు రూట్.. ‘గే అన్న పదాన్ని గేలి చేసేందుకు ఉపయోగించకు. గే గా ఉండడంలో తప్పులేదని రూట్ బదులిచ్చాడు. అయితే గే అన్న దానితో నాకు సంబంధంలేదు. నువ్వు మాత్రం నన్ను చూసి నవ్వడం ఆపు అని రూట్‌కు సమాధానమిచ్చా’ అని గాబ్రియెల్ తెలిపాడు.