న్యూఢిల్లీ : పొరుగు దేశాలతో గత ప్రభుత్వం కొనసాగించిన సత్సంబంధాల్ని ప్రధాని మోదీ తెంచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ట్విట్టర్ లో విమర్శించారు. పొరుగు దేశాలతో స్నేహితంగా ఉండకపోతే చాలా ప్రమాదమని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ‘అనేక దశాబ్దాలుగా పొరుగు దేశాలతో కాంగ్రెస్ పోషించిన సంబంధాలను మోదీ నాశనం చేస్తున్నారు. పొరుగు దేశాలతో మిత్రత్వం లేకపోవడం చాలా అపాయకరం’ అని మండిపడ్డారు.