టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు తెలుస్తోంది. వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గంటా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు కూడా చెపుతున్నారు.ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అదే రోజున గంటా వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై.. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని, అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉండటంతో.. గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.