ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు లాభాల్ని గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు లాభపడి 40,869 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 12,052 వద్ద నిలిచాయి. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ.71.82 వద్ద దాఖలైంది. వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్స్, అల్ట్రాటెక్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్ని గడించాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ పెట్రోలియం, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.