స్టాక్‌ మార్కెట్లకు భారీ లాభాలు

స్టాక్‌ మార్కెట్లకు భారీ లాభాలు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 40,470కి, నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 11,966 వద్ద నిలిచాయి. ఒక దశలో 570 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఏకంగా 40,607కి చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీదే విపణిలో ఈ రోజు ఆధిపత్యం.మరిన్ని ఉద్దీపన చర్యల్ని కేంద్రం చేపట్టబోతోందన్నవార్తల వల్ల మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో సీఐసీఐ బ్యాంక్ (2.47%), ఇన్ఫోసిస్ (2.39%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.76%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.42%) ఎక్కువగా లబ్ధి పొందారు. భారతి ఎయిర్ టెల్ (-3.45%), ఓఎన్జీసీ (-1.09%), బజాజ్ ఫైనాన్స్ (-1.08%), మారుతి సుజుకి (-1.07%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.06%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos