ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.38 గంటల వేళకు నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 12,132 పాయింట్ల వద్ద ,సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 41,283 వద్ద ఉన్నాయి. రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్‌లు లాభాల్ని గడించాయి. డీమార్ట్ షేర్లు నాలుగు శాతం లాభాల్లో ఉన్నాయి.