ముంబై :స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 224 పాయింట్లు బలపడి 46,890 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 13,741 వద్ద ఆగి జీవనకాల దాఖలాల్నినమోదు చేసింది. హెచ్డీఫ్సీ, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఓఎన్జీసీ, మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హెచ్యూఎల్, ఎస్బీఐ షేర్లు నష్టాల పాలయ్యాయి.