ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్ని గడించాయి. లాభాల్లో మొదలైన వ్యాపారం చివరి వరకూ అదే జోరును కొన సాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 320 పాయింట్లు లాభపడి 41,626 వద్ద, ఎన్ఎస్ఈ 100 పాయింట్లు లాభపడి 12,282 వద్ద నిలిచాయి. యూఎస్ డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ.71.31 వద్ద దాఖలైంది. టాటా మోటర్స్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వేదాంతా షేర్లు లాభాల్ని పొందాయి. ఐషర్ మోటర్స్, బజాజ్ ఆటో లిమిటెడ్, భారత్ పెట్రోలియం, సిప్లా, డా.రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టపోయాయి.