న్యూ ఢిల్లీ : దేశ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రూ.యాభై లక్షల కోట్లు అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘జీడీపీని 2-3 శాతానికి వృద్ధి చేసేందుకు ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తోంది. అయితే వృద్ధి రేటు తిరోగమనం సమస్యగా మారింది. దీని సాధనకు విపణిలో ద్రవ్య ప్రవాహం సాగాలి. గత రెండు మూడు నెలలుగా వ్యాపార లావా దేవీలు లేవు. ప్రతి రంగం, ప్రతి పౌరుడూ చిక్కుల్లో ఉన్నారు. కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి మరో 20 లక్షల కోట్లు, పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో మరో రూ.పది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుంది. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల పునరుద్ధరణకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఈ ఏడాది ఆఖరుకు 25 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమల పునర్మింర్మాణానికి చూస్తున్నాం. 45 రోజుల్లోగా వీటి బకాయిల్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ కంపెనీలు చెల్లించాలి.