తండ్రి పాలనా విధానాలు.. కోట్లు కొల్లగొడుతున్న కొడుకులు

తండ్రి పాలనా విధానాలు.. కోట్లు కొల్లగొడుతున్న కొడుకులు

న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశపెట్టిన ఇథనాల్‌-పెట్రోల్‌ పాలసీపై కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ లక్ష్యంగా కాంగ్రెస్‌  విమర్శలు గుప్పించింది. ఈ పాలసీని తండ్రి గడ్కరీ ప్రవేశపెట్టగా, ఆయన కుమారులు దాని ద్వారా విస్తృత ప్రయోజనం పొందుతున్నారని, ఈ వివాదాస్పద ప్రయోజనంపై విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలన్న జాతీయస్థాయి పాలసీని కేంద్రం ప్రవేశపెట్టడంతో గడ్కరీ కుమారులు నిఖిల్‌, సారంగ్‌లు ఈ ప్రాజెక్టులను చేపట్టారని, ఇవి గణనీయమైన అభివృద్ధిని సాధించాయని ఆయన ఆరోపించారు. ఏడాది వ్యవధిలోనే వీరి ఒక కంపెనీ ఆదాయం 18 కోట్ల నుంచి 523 కోట్లకు, మరో కంపెనీ 37 కోట్ల నుంచి 638 కోట్లకు పెరిగిందని  విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos