టికెట్ ఇస్తానంటూ ఇచ్చిన హామీను కేసీఆర్ తుంగలో తొక్కాడని ఆరోపిస్తూ మాజీ ఎంపీ గడ్డం వివేక్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు.కాంగ్రెస్‌లో ఉన్న నన్ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి తెరాసలోకి ఆహ్వానించారన్నారు.ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పెద్దపల్లి టికెట్‌పై వివేక్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతూ తెరాస అధినేత కేసీఆర్ టికెట్‌ను ఇటీవల తెరాసలో చేరిన వెంకటేశ్‌కు ఇచ్చారు.దీంతో మనస్తాపం చెందిన వివేక్ ప్రభుత్వ సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు.2019 ఎన్నికల్లో టికెట్ తనకే ఇస్తానని మాట ఇవ్వడంతోనే తెరాసలో చేరాననే విషయాన్ని పేర్కొన్న వివేక్ తన రాజీనామా పత్రాన్ని తెరాస అధినేత కేసీఆర్‌కు పంపించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడి పదవి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని లేఖలో పేర్కొన్నారు.తన తండ్రి బాటలోనే తాను కూడా పెద్దపల్లి ప్రజలకు సేవ చేయడానికి నిర్ణయించుకున్నట్లు వివేక్ తెలిపారు.భవిష్యత్ కార్యాయరణపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినా పెద్దపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి వివేక్ నిర్ణయించుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి..