వెనుకబడిన జిల్లాలకు నిధులు

వెనుకబడిన జిల్లాలకు నిధులు

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన నాలుగో విడత నిధుల విడుదల పరీశీలనలో ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఒడిశాలోని కలహండి, బోలంగీర్, కోరాపుట్ జిల్లాలు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి ప్రకటించిన ప్యాకేజీ మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. అయితే ఈ జిల్లాల అభివృద్ధికి ఆర్థికంగా ఆలంబన ఇవ్వాలని నీతి అయోగ్ చేసిన సిఫార్సు మేరకే ప్రతి జిల్లాకు రూ.300 కోట్లు చొప్పున మొత్తం 2,100 కోట్లను విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos