పళ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు అనాదిగా చెబుతూనే ఉన్నారు. దానిని నిజం చేసే ఓ సత్యాన్ని ఆక్స్‌పర్డ్ పరిశోధకులు కనుగొన్నారు. దీని కోసం ఏడేళ్ల పాటు అయిదు లక్షల మంది జీవితాలను పరిశీలించారు. వీరిలో 18.8 శాతం మందికి తరచూ పళ్లు తినే అలవాటుంది. వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇలాంటి వారిలో గుండె జబ్బుల మరణాలు మూడో వంతు తక్కువగా ఉన్నట్లు తేలింది. కనుక పళ్లు తినడం అలవాటు చేసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకవచ్చని పరిశోధకులు తేల్చారు.