శాసనసభ ఎన్నికల్లో ఆయా పార్టీల అధ్యక్షులు,అధినేతలు తమ సొంత నియోజకవర్గం
నుంచి పోటీ చేయడం పరిపాటి.తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వైసీపీ అధినేత
జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయడం ఖరారే.అయితే మొదటిసారి ఎన్నికల బరిలో
దిగనున్న జనసేన అధినేత పోటీ చేసే నియోజకవర్గంపై కొంత ఆసక్తి నెకలొంది. వచ్చే ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు తమ తమ దరఖాస్తులను స్క్రీనింగ్
కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మంగళవారం పవన్ తన దరఖాస్తును పవన్‌కళ్యాణ్
జనసేన స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చారు. స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ అభ్యర్థుల దరఖాస్తును
పరిశీలించి, ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచిది, ఎవరు పోటీ చేస్తే మంచిది, ఎవరు ఎక్కడి
నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనేది నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో జనసేనాని
ఇచ్చిన దరఖాస్తును స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు కొన్ని
స్థానాలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.విశాఖపట్నంలోని గాజువాక
అసెంబ్లీ నియోజకవర్గం లేదా తూర్పు గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్
పోటీ చేస్తే బాగుంటుందని స్క్రీనింగ్ కమిటీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్క్రీనింగ్
కమిటీ ప్రధానంగా గాజువాక నియోజకవర్గానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. దీనిపై
మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే
అంశం అందరిలోను చర్చనీయాంశంగా మారింది. ఆయన తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే తమ
నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు అభిమానులు, జనసైనికులు కోరుకుంటున్నారు.