మన్మోహన్ సింగ్‌కు కరోనా

ఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే కొవిడ్ నియంత్రణ ఇలా చేయవచ్చంటూ కేంద్రానికి మన్మోహన్ పలు సూచనలు చేశారు. ఆ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
దేశంలో మహోగ్రరీతిలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను అయిదు సూత్రాలతో కట్టడి చేయవచ్చని వివరించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధానంగా పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos