వివిధ విమానయాన సంస్థలు దాదాపు 200 విమాన సర్వీసులను రద్దు చేయడంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీ-ముంబాయి లాంటి ప్రధాన రూట్లలో ఈ పెరుగుదల భారీగానే ఉంది. జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక ఇబ్బందులు, ఇండిగో పైలట్లను సర్దుబాటు చేయడం, ముంబై విమానాశ్రయం రన్‌వే మరమ్మతులు లాంటి కారణాల వల్ల 200 విమానాల సర్వీసులు రద్దయ్యాయి. గతేదాడితో పోల్చితే టికెట్ల ధరలు 20 శాతం దాకా పెరిగాయి. ముంబై-ఢిల్లీ విమాన ఛార్జీ రూ.20 వేలకు పెరిగింది. ప్రయాణికుల సంఖ్య పెరగడం, పెళ్లిళ్ల సీజన్ లాంటి కారణాలు ఛార్జీలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఓ వైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే, మరో వైపు విమాన సర్వీసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.