ఒంగోలు: ఒంగోలు సమీపంలో తల్లీ కూతుళ్లను రాళ్లతో కొట్టి, ఆ తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. పేర్న మిట్ట -మారెళ్ల గుంట పాలెంకు మార్గంలో ఒక యువతి, చిన్న పాప మంటల్లో తగలబడుతున్నట్టు మంగళ వారం రాత్రి పోలీ సులకు సమాచారం అందింది. దీంతో మద్దిపాడు పోలీసులు హుటాహుటిన ఆ స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రెండు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయి. యువతికి 25 ఏళ్ల వయసు ఉంటుందని, ఆమె కుమార్తెకు ఏడాది వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.