న్యూఢిల్లీ: భారత్పై పలు ఆంక్షల్ని విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తాజాగా డిజిటల్ స్ట్రయిక్ చేయదలచినట్లు తెలిసింది. పైకి వ్యూహాత్మక భాగస్వామిలా కనిపిస్తూనే, ఇండియాపై కత్తి కట్టారు. తాజాగా ఇప్పుడు రెండు దేశాల మధ్య కొత్త వివాదం-గూగుల్ టాక్స్. దీని ప్రకారం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరిక పన్నుల మోత మోగిస్తుంది. ఈ చట్టాన్ని 2016-17లో ఈక్వలైజేషన్ టాక్స్ పేరిట ప్రవేశపెట్టారు. అది గత జూన్ నుంచి అమలులోకి వచ్చింది. మన దేశం బయట శాశ్వత కార్యాలయాలను నిర్వహిస్తూ, వాణిజ్య ప్రకటనల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి దిగ్గజ డిజిటల్ కంపెనీలన్నీ ఈ చట్టం పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ చట్టానికి ‘గూగుల్ టాక్స్’ అన్న పేరు వచ్చింది. వీటికి ఇండియా నుంచి అత్యధిక ఆదాయం లభిస్తున్నా చెల్లించాల్సినంత పన్నులను చెల్లించడం లేదు. సరైన చట్టాలు లేక పోవడంతో ఇందుకు కారణం. ఇక్కడి వాణిజ్య ప్రకటనల డబ్బంతా విదేశాల్లోని సంస్థ ప్రధాన కార్యాలయాలకు చేరుతున్నాయి. వీటి నివారణకు ఫ్రాన్స్ డిజిటల్ సంస్థలపై 3 శాతం పన్నులను వేసింది. దీని స్పూర్తిగా వాణిజ్య ప్రకటనల ఆదాయంపై ఆరు శాతం పన్ను విధించింది. దీన్ని నేరుగా వినియోగదారుడే చెల్లించాలని షరతు పెట్టింది.దరిమిలా 2019లో రూ. 900 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది. 2020లో దీన్ని సవరించి, ఎలాంటి ఆదాయమైనా 2 శాతం డిజిటల్ సేవల పన్ను కట్టాల్సిందేనని చట్టాన్ని తెచ్చింది. దీంతో ఆగ్రహించిన గూగుల్, ఫేస్ బుక్ తదితర సంస్థలు అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ట్రంప్ స్వయంగా బరిలోకి దిగారు. కల్పించుకున్నారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతయ్యే సరుకులపై అమెరికా 25 శాతం సుంకాలను పెంచింది.