వెంకన్న ఖాతాలు ఇక ప్రభుత్వ బ్యాంకుల్లోనే

వెంకన్న ఖాతాలు ఇక ప్రభుత్వ బ్యాంకుల్లోనే

అమరావతి:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సొమ్మును జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని తితిదే పాలక మండలి తీర్మానించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో మదుపునకు భద్రత లేక పోవటమే ఇందుకు ప్రధాన కారణం. త్వరలోనే రూ.15 00 కోట్లు జాతీయ బ్యాంకులో ధరావత్తు చేయనున్నారు. గత ప్రభుత్వం తితిదే సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో ధరావత్తు చేసిన పుడు పలువురు భక్తులు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేసారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో ధరావత్తు చేసినందుకు ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దరిమిలా న్యాయస్థానం సూచన మేరకు జాతీ య బ్యాం కు ల్లోనే డిపాజిట్లు చేయనున్నారు. కానుకల రూపంలో శ్రీవారికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్న విషయం తెలి సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos