గ్యాస్​ లీకై ఐదుగురు మృతి

గ్యాస్​ లీకై ఐదుగురు మృతి

మంగళూరు : ఇక్కడి స్పెషల్ ఎకనామిక్ జోన్లోని ఒక కర్మాగారంలో ఆదివారం రాత్రి గ్యాస్ లీకవడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఫిష్ ఫ్యాక్టరీలోని ఫిష్ వేస్ట్ ట్యాంకును శుభ్రం చేయడానికి దిగిన ఉద్యోగి ఒకరు అస్వస్థతకు గురయ్యాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన ఇతర కార్మికులు కూడా అదే పరిస్థితి ఎదురైంది. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురిని ఉమర్ ఫరూక్, నిజాముద్దిన్సాబ్, సమీరుల్లా ఇస్లాంలుగా గుర్తిం చారు. వీరిలో ఉమర్ ఫరూక్ బంగాల్కు చెందిన వ్యక్తని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా పలువురు బంగాల్ వాసులే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos