తిరువనంత పురం : కరోనా వల్ల కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఎదుర్కుంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాల గురించి నిర్వహించనున్న చర్చలో భాగస్వాములు కావాలని వివిధ రాష్ట్రాలను కేరళ ప్రభుత్వం కోరింది. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టిఎం థామస్ ఐజాక్ ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ లేఖ రాసారు. ‘ కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ఆర్థికాంశాలు తీవ్ర ఆటంకంగా మారుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల్లో ఇప్పటికే కోత పెట్టాయి. అయినా, కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన వనరులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సమాఖ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న వారందరూ, ఆర్థికరంగం లోనూ సమాఖ్య విలువ లను (ఫిస్కల్ ఫెడరలిజం) కొనసాగిం చడానికి ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ‘దానికి ఇదే సరైన సమయంగా భావిస్తునాను. అయితే, భౌతికంగా ఒక్క దగ్గర చేరి సెమినార్ మాదిరి చర్చించడానికి ఇది సమయం కాదు కాబట్టి, ఈ నెల 27,28 తేదిలలో వెబినార్ నిర్వహిస్తున్నాం. దానిలో పాల్గొనడం ద్వారా మీ అభిప్రాయలు, సూచనలు తెలపండి.’ అని థామస్ ఐజాక్ కోరారు. ఒక్కో సెషన్ను రెరడు గంటల పాటు నిర్వహించదలచారు. వివిధ రాష్ట్రాల నురచి వచ్చే ప్రశ్నలను చర్చిం చేందుకు ప్యానల్ను కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులతో పాటు ప్రముఖ విద్యా వేత్తలు, అధికారులు, ఆర్ధిక రంగం, ద్రవ్య సమాఖ్యలపై అవగాహన ఉన్న పాత్రికేయులను కూడా వెబినార్కు ఆహ్వానించిన్నట్లు తెలిపారు.