తెలుగు ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు..ఆకట్టుకుంటున్న టీజర్‌..

  • In Film
  • March 16, 2019
  • 210 Views
తెలుగు ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు..ఆకట్టుకుంటున్న టీజర్‌..

ప్రస్తుతం విద్యావ్యవస్థ,ప్రైవేటు పాఠశాలలు,విద్యాసంస్థల బోధనతీరు,తమ పిల్లలు ర్యాంకులు సాధించాలనే తల్లితండ్రుల ఆకాంక్షలతో విద్యార్థులు ఎంత సతమతమవుతున్నారో,చదువులు మినహా మరే ప్రపంచ జ్ఞానం లేకుండా కాలేజీల నుంచి బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనే సందేశానికి హాస్యం జోడించి కన్నడలో రెండేళ్ల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.కన్నడలో చిత్రాన్ని నిర్మించిన అదే సంస్థ,అదే దర్శకుడు తెలుగులో కూడా చిత్రాన్ని రీమేక్‌ చేశారు.అందుకు సంబంధించి శనివారం టీజర్‌ విడుదల చేశారు.చదువు తప్ప ప్రపంచంలో ఇంకేది పనికిరాదని చదువు మాత్రమే విలువైనదంటూ ఓ తండ్రి తన కొడుకు రాజును అతిజాగ్రత్తగా పెంచుతూ అతిగా చదివిస్తాడు.చదువులు పూర్తయ్యాక బయటి చదువు తప్ప మరే విషయాలపై ఏమాత్రం అవగాహన లేకుండా ప్రపంచంలో అడుగుపెట్టిన రాజు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చివరకు ఎలా నెగ్గాడు అనే కథతో చిత్రాన్ని తెరకెక్కించారు.టీజర్‌ చూస్తే చిత్రాన్ని ఏమాత్రం అశ్లీలత లేకుండా తెరకెక్కించినట్లు అర్థమవుతుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను చిత్రం మెప్పించేలా కనిపిస్తోంది.ఫస్ట్ ర్యాంక్ రాజు ద్వారా కేతన్ మద్దినేని-కషిష్ ఓరా జంటగా పరిచయమవుతున్నారు.ప్రకాష్ రాజ్-బ్రహ్మానందం-ప్రియదర్శి-వెన్నెల కిషోర్-రావు రమేష్-పోసానిలతో పాటు ఇటీవలే మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన నరేష్ తండ్రి పాత్ర పోషించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos