పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల ముసుగులో విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింహస్వప్నంగా మారారు.విధ్వంసానికి పాల్పడితే మీ ఆస్తులు వేలం వేసి నష్టాన్ని రికవరీ చేసుకుంటామని ముందుగానే హెచ్చరించిన యోగి చెప్పినట్లే విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తుల ఆస్తులు వేలం వేయడానికి నిర్ణయించుకున్నారు.ఈ మేరకు రాంపూర్ జిల్లాలో కొంతమందికి నోటీసులు పంపించారు. తొలిదశలో 14.87 లక్షల రూపాయల మేర నష్ట పరిహారాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. మొత్తం 28 మంది ఆందోళనకారులకు నోటీసులను జారీ చేశారు. నష్టాన్ని చెల్లించకపోతే.. ఆస్తులను జప్తు చేస్తామని ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు.పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ లో పెద్ద ఎత్తు ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనల సందర్భంగా రాజధాని లక్నో సహా బులంద్ షహర్, బహ్రెయిచ్, గౌతమబుద్ధ నగర్, ముజప్ఫర్ నగర్, ఘజియాబాద్, రామ్ పూర్ వంటి సుమారు 20 జిల్లాల్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైంది. పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టారు నిరసనకారులు. ఉత్తర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.సీసీ కెమెరాల ఫుటేజ్‌లు ఇతర సాక్షుల ఆధారంగా విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి నోటీసులు పంపించారు..