పాక్‌ కాల్పుల్లో జవాను మృతి

శ్రీనగర్: జమ్ము-కశ్మీర్ రాజౌరి జిల్లా , సుందర్బాని సెక్టార్లోని కెరి బెల్ట్ ప్రాంతంలో సరిహద్దు రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు గురువారం ఉదయం మరోసారి జరిపిన కాల్పుల్లో భారతీయ పదాతిదళ జవాను ఒకరు మృతి చెందారు. మోర్టార్ బాంబులను కూడా ప్రయోగించారు. పాక్ బలగాలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ దాదాపు 110 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు సైనిక అధికారులు తెలిపారు.

ఇద్దరు పోలీసులకు గాయాలు
జమ్ము- కశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్ టౌన్షిప్లో గురువారం ఉదయం పోలీసు వాహనాలు వెళ్లే దారిలో గ్రనేడ్ను పేల్చి దాడి చేసారు. ఈ ఘటనలో స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ , మరో పోలీసు అధికారికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో వెంటనే ముమ్మర గాలింపుల్ని చేపట్టినట్లుపోలీసులు తెలపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos